Breaking News

పరువు నష్టం కేసులో రాహుల్‌ శిక్షపై స్టేకు నిరాకరణ.. జడ్జి బదిలీ

Published on Fri, 08/11/2023 - 11:42

న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి జైలు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన గుజరాత్‌ హైకోర్టు జడ్జిపై బదిలీపై వెళ్లనున్నారు. పై పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జాబితాలో ఆయన కూడా ఉన్నారు. మెరుగైన న్యాయ నిర్వహణ కోసం జస్టిస్‌ ప్రచక్‌ను పాట్నా హైకోర్టుకు పంపుతున్నట్లు కొలీజియం  తెలిపింది.

గుజరాత్‌ హైకోర్టు జడ్జి అయిన హేమంత్‌ ఎమ్‌ ప్రచక్‌.. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జూలైలో 123 పేజీల తీర్పు వెల్లడించారు.అంతేగాక 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ బీజేపీ మంత్రి మాయా కొద్నానీ తరుపున వాదించిన న్యాయవాదులలో జస్టిస్ ప్రచ్చక్ ఒకరిగా గతంలో  ఉన్నారు. 

జస్టిస్‌ ప్రచక్‌తోపాటు 2002 గోద్రా అల్లర్లకు సంబంధించి హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న గుజరాత్ హైకోర్టు జడ్జి మరో జస్టిస్‌ సమీర్‌ దవే.. రాహుల్‌ గాంధీ జైలు శిక్షను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ గీతా గోపి కూడా ఉన్నారు.వీరితోపాటు పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు నుంచి ఒకరు కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తొమ్మిది పేర్ల జాబితాలో ఉన్నారు. 

సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈనెల 3న సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన న్యాయం అందించేందుకే బదిలీలు సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం  గురువారం పేర్కొంది.
చదవండి: మణిపూర్‌ అంశం.. మోదీపై అమెరికా సింగర్‌ మిల్‌ బెన్‌ కీలక వ్యాఖ్యలు

కాగా గుజరాత్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ ప్రచక్.. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇక 2021లో గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మరోవైపు అత్యాచారానికి గురైన మైనర్ బాలిక గర్బం దాల్చగా.. అబార్షన్‌కు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ సమీర్‌ దవే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మనుస్మృతి ప్రకారం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేనని వ్యాఖ్యానించారు. ‘కావాలంటే మీ అమ్మ.. అమ్మమ్మను అడగండి.. అప్పట్లో వివాహానికి గరిష్ఠ వయసు 14, 15 ఏళ్లే.. 17 ఏళ్లు రాక మునుపే తన తొలి బిడ్డకు జన్మనిచ్చేవారు.. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు.. మీరు మనుస్మృతి చదవలేదేమో.. ఓసారి చదవండి’ జస్టిస్ దవే అన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)