Breaking News

52 ఏళ్ల తర్వాత ఆడ సంతానం.. అగర్వాల్‌ ఇంట్లో సందడి!

Published on Sat, 08/01/2026 - 13:56

ఇండోర్‌: మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత ఓ కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. ఏకంగా 52 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో పసిపాప కేరింతలు వినిపించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండోర్ కు చెందిన ముస్కాన్ అగర్వాల్ దంపతులకు ఇటీవల పసిపాప జన్మించింది. అయితే, ఈ జననం సాధారణమైనది కాదు.

ఆ కుటుంబంలో గత 52 సంవత్సరాలుగా కేవలం మగ సంతానం మాత్రమే పుడుతూ వస్తోంది. ఐదు దశాబ్దాలకు పైగా ఆ కుటుంబంలో ఒక్క ఆడపిల్ల కూడా జన్మించలేదు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సాగిన ఈ సుదీర్ఘ నిరీక్షణకు తాజాగా తెరపడింది. తమ ఇంట్లో నూతన  అతిథిగా మహాలక్ష్మి ప్రవేశించడంతో ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ ఈ భావోద్వేగ క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి పసిపాపను బయటకు తీసుకొచ్చిన క్షణంలో కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందభాష్పాలు రాలినట్లు ఆమె తెలిపారు.

‘కొన్నిసార్లు అద్భుతాలు జరగడానికి తరాలే పడతాయి" అంటూ ఆమె ఈ సంఘటనపై హృదయాలను హత్తుకునే వ్యాఖ్యలు రాశారు. 52 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కుటుంబంలో తొలిసారిగా ఆడపిల్ల పుట్టడంతో ఇండోర్ లోని ఆ ఆస్పత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవజాత శిశువు తల్లి ముస్కాన్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ అద్భుతమైన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తూ కుటుంబ సభ్యులకు అభినందనలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ‘ఫ్రంట్ కెమెరా’పై ప్రముఖ నటుడు ఎగతాళి!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)