Breaking News

భారత్‌ దెబ్బ అదుర్స్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎమర్జెన్సీ!

Published on Sun, 04/27/2025 - 11:07

దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.

నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. 

మన కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

అయితే కరువు... లేకపోతే వరద!
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. 

హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్‌కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది.  
 

ఇ​క, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.
-జమ్ముల శ్రీకాంత్.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)