Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..

Published on Mon, 02/10/2025 - 13:18

మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్‌లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్‌ మహతోకు సంబంధించినది.

ఆ సమయంలో ప్రకాష్‌.. కోడర్మా మునిసిపల్‌ కార్పొరేషన్‌(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్‌ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్‌ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్‌ ఆచూకీ తెలియరాలేదు.

అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్‌ మహతోను బీహార్‌లోని రాణిగంజ్‌(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్‌లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్‌ యజమాని సుమిత్‌ అతనికి పహల్వాన్‌ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్‌ అదే హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్‌లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్‌ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్‌ యజమాని సుమిత్‌కు చెప్పాడు. దీంతో సుమిత్‌ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్‌ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.

దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్‌ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్‌, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్‌ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్‌, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి  కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి?

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)