Breaking News

రాహుల్‌ గాంధీపై  నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ 

Published on Sun, 05/25/2025 - 01:05

చైబాసా: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాందీకి పరువు నష్టం కేసులో జార్ఖండ్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. జూన్‌ 26వ తేదీన స్వయంగా న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్‌ లాయర్‌ చేసిన వినతిని తోసిపుచ్చింది. 2018లో కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు వ్యతిరేకంగా రాహుల్‌..‘హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం బీజేపీ అధ్యక్షుడవుతారు’అంటూ వ్యాఖ్యానించారు. 

దీంతో రాహుల్‌ గాంధీ బీజేపీ కార్యకర్తలందరి మనోభావాలను దెబ్బతీశారంటూ ఆ పార్టీ నేత ప్రతాప్‌ కటియార్‌ చైబాసాలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ/ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి ఈ పిటిషన్‌ బదిలీ అయ్యింది. విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్‌ రాహుల్‌ గాం«దీకి పలుమార్లు సమన్లు పంపారు. వీటిని ఆయన పట్టించుకోకపోవడంతో బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు. దీంతో, రాహుల్‌ స్టే కోసం జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను 2024 మార్చిలో న్యాయస్థానం కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సైతం చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా, మరింత కఠినమైన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పంపింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)