Breaking News

పాక్‌ కన్నా నరకం మేలు: జావెద్‌ అఖ్తర్‌ 

Published on Mon, 05/19/2025 - 06:33

న్యూఢిల్లీ: దేశభక్తి, మతం అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించే సినీ రచయిత జావెద్‌ అఖ్తర్‌ (80) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎక్కడికెళతావని అడిగితే తాను నరకాన్నే ఎంచుకుంటానని చెప్పారు. శనివారం రాత్రి ముంబైలో శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ రాసిన పుస్తకం ‘హెవెన్‌ ఇన్‌ ది స్వాంప్‌’(చిత్తడి నేలలో స్వర్గం) ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.

 తనను నాస్తికుడని చెప్పుకునే జావెద్‌ అఖ్తర్‌ భారత్, పాకిస్తాన్‌ల నుంచి అతివాదులు నిత్యం తనపై దుర్భాషల వర్షం కురిపిస్తున్నారని వెల్లడించారు. వీరిలో ఎవరైనా నన్ను దూషించడం ఆపేస్తే, చాలా ఆందోళన చెందుతాను. ‘కాఫిర్‌ అని, నరకానికి వెళ్తావని ఒకరంటే, జిహాదీ, పాకిస్తాన్‌కు పొమ్మంటూ మరొకరు దూషిస్తారు. 

పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎటు వెళ్లాలన్న ప్రశ్న వస్తే మాత్రం నేను నరకానికే వెళ్తానంటాను’అంటూ జావెద్‌ అఖ్తర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆహూతుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ‘పౌరులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారై ఉండరాదు. ఏ ఒక్క పార్టీకీ విధేయత చూపరాదు. అలాంటప్పుడు మాత్రమే పౌరులు ఏది తప్పో, ఏది రైటో చెప్పగలరు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)