Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌.. జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం

Published on Thu, 05/08/2025 - 16:29

ఐసీ-814 విమానం హైజాక్‌లో కీలక సూత్రధారి జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్  హతమయ్యారు. భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో అజార్ స్థావరం సైతం ధ్వంసమయ్యింది. జైషే మహ్మద్‌ ఉగ్రమూకలో అబ్దుల్‌ రవూఫ్ పనిచేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. వారిలో అబ్దుల్ రవూఫ్ అజార్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైషే‌ను స్థాపించిన మసూద్ అజార్ సోదరుడే అబ్దుల్ రవూఫ్ అజార్.

కాగా, పాకిస్తాన్‌లోని బహావల్పూర్‌ నగరంలో భారత్‌ జరిపిన దాడుల్లో ఉగ్రసంస్థ జైషే మొహహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. మసూద్‌ అజార్‌ కుటుంబంలో పది మంది హతమయ్యారు. బహావల్పూర్‌లోని జామియా మసీద్‌ సుభాన్‌ అల్లాహ్‌ శిబిరం సముదాయంపై భారత్‌ జరిపిన క్షిపణి దాడిలో అజార్‌ సోదరి, ఆమె భర్త, అజార్‌ మేనల్లుడు, అతని భార్య, మరో మేనల్లుడు, ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు. వీరితోపాటే అజార్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అతని తల్లి, మరో ఇద్దరు వ్యక్తులూ మరణించారు. ఈ దాడిలో అబ్దుల్ రవూఫ్ అజార్ గాయపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం అజార్ కన్నుమూశాడు.

1999లో ఐసీ–814 విమానాన్ని హైజాక్‌ చేశాక దానిని విడిచిపెట్టాలంటే మౌలానా మసూద్‌ అజార్‌ను వదిలేయాలని హైజాకర్లు డిమాండ్‌ చేయడం, తప్పని పరిస్థితుల్లో అజార్‌ను జైలు నుంచి వదిలేయడం తెల్సిందే. విడుదలైన నాటి నుంచి అజార్‌ పాకిస్తాన్‌ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలను ఉధృతం చేశాడు. సుభాన్‌ శిబిరం అలియాస్‌ ఉస్మానో అలీ క్యాంపస్‌గా పిలుచుకునే ఈ ప్రాంగణాన్ని జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయంగా అజార్‌ వినియోగించుకుంటున్నాడు.

18 ఎకరాల ఈ ప్రాంతం నుంచే జైషే ఉగ్రసంస్థలోకి కొత్త వాళ్ల రిక్రూట్‌మెంట్లు, విద్వేష బోధన, శిక్షణ, నిధుల సేకరణ తదితర కార్యకలాపాలు కొనసా గుతుంటాయి. 2019 మేలో అజార్‌ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఏప్రిల్‌ తర్వాత అజార్‌ పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. బహావల్పూర్‌లోనే ఉంటున్నట్లు గతంలోనే నిఘా సమాచారం భారత్‌కు అందింది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2000లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడులకు మసూద్‌ అజార్‌ సూత్రధారి అని తెలుస్తోంది.   

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు