జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్‌!

Published on Sat, 10/28/2023 - 13:09

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోవాలోని కోల్‌వాలే సెంట్రల్ జైలుకు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. జైలు ఖైదీలు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపధ్యంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రకాంత్ హరిజన్, జైలర్లు మహేష్ ఫడ్తే, అనిల్ గాంకర్, అసిస్టెంట్ జైలర్ రామ్‌నాథ్ గౌడ్‌లను సస్పెండ్ చేస్తూ, జైలు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

దసరా సందర్భంగా ఖైదీలు టపాకులు కాల్చి, రావణుని బొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఖైదీలు దిష్టిబొమ్మను ఎలా దహనం చేశారనే దానిపై జైలు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. 

జైలు ఆవరణలో మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే దానిపై కూడా విచారణ జరగనుంది. ఈ ఘటన జైలు భద్రతపై అనుమానాలను లేవదీస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటనకు జైలు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా పరిగణించారని, అందుకే వారిని సస్పెండ్ చేశారని ఒక పోలీసుల అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: భారత్‌లో ఇరాన్‌ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్‌పీ నేత!

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)