Breaking News

Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర

Published on Mon, 07/08/2024 - 04:18

భువనేశ్వర్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. 

ఆమె, ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌ దాస్, సీఎం మోహన్‌ చరణ్‌ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.

సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్‌ జిల్లాకు చెందిన లలిత్‌ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్‌ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)