Breaking News

‘అది ప్రమాదం కాదు.. ఆప్‌ చేసిన హత్యలు’

Published on Sun, 07/28/2024 - 08:15

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక ఇనిస్టిట్యూట్‌ భవనం బేస్‌మెంట్‌లోకి భారీగా వరద నీరు చేరడానికి, ఆ నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్థినులు మృతి చెందడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వమే కారణమని, ఇది ప్రమాదం కాదని, ఆ పార్టీ చేసిన హత్యలని బీజేపీ ఆరోపించింది.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో జరిగినది ప్రమాదం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన హత్యలు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇటీవల పటేల్ నగర్‌లో విద్యుదాఘాతంతో యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థి మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఈ విధంగా చాలా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలు విలేకరుల సమావేశాలు నిర్వహించడం, ప్రకటనలు ఇవ్వడం, ఆరోపణలు చేయడం తప్ప మరో పనిచేయడం లేదని పూనావాలా ఆరోపించారు.

ఢిల్లీలో ఎక్కడ చూసినా నీటి మడుగులు కనిపిస్తున్నాయని, ఇవి ప్రాణాంతకంగా మారాయన్నారు. దీనికి పూర్తి బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీదేనన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా  మాట్లాడుతూ ఈ ఘటన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్లక్ష్య పూరిత పనితీరుకు ఉదాహరణ అని  అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతని సహచరులంతా కలసి కాలువలు శుభ్రం చేయడానికి కేటాయించిన డబ్బును కూడా తిన్నారని అరోపించారు. ఢిల్లీలో ఒక్క గంట వర్షం కురిస్తే  చాలు వరదలు సంభవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం  చేశారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)