Breaking News

అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్‌ పైలట్ ఆవేదన వైరల్‌

Published on Wed, 03/11/2026 - 17:14

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు, ఇరాన్‌ ప్రతి దాడుల మధ్య మధ్యప్రాచ్యంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది.  భారత విమాన యాన సంస్థలు , గల్ఫ్ విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాలను రద్దు చేశాయి.  

ఫిబ్రవరి 28-మార్చి 5 మధ్య భారతదేశం-మధ్యప్రాచ్య మార్గాల్లో 1,770 విమానాలు రద్దయ్యాయి. అనేక మంది ప్రయాణీకులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే వీరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో ఫరీదాబాద్‌కు చెందిన యువ పైలట్, 23 ఏళ్ల దీపిక అధానా, UAEలో చిక్కుకున్న 169 మంది భారతీయులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రయాణీకులను సురక్షితంగా ఢిల్లీకి తిరిగి తీసుచ్చి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇంత ఉద్రికత్తతల మధ్య  విమానం బయలుదేరే ముందు "అమ్మా, బై బై. నేను తిరిగి వస్తానో లేదోనాకు తెలియదు"  అని చెప్పి మిషన్‌కు బయలు దేరడంమాత్రమే కాదు ఎన్నో సవాళ్ల మధ్య   అత్యంత సాహసంగా వ్యవహరించి సురక్షితంగా ఢిల్లీకి  చేరడం పలువురిని భావోద్వేగానికి గురి చేసింది.  

ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్‌ క్రూ రీల్‌, ఎయిరిండియా విచారణ

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో బాధితుల బంధువులు, అదికారులు అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.  క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చిన తన కూతురిని చూసి దీపికా తల్లి కూడా తనకెంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దీపికా అధానా, కెప్టెన్ జస్వీందర్ కౌర్ నేతృత్వంలోని ఆరుగురు మహిళా సభ్యుల బృందం ఉన్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah) విమానాశ్రయం నుండి యుద్ధ వాతావరణం వల్ల అక్కడ చిక్కుకుపోయిన 169 మంది భారతీయ ప్రయాణికులను సురక్షితంగా ఢిల్లీకి చేర్చారు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటీ అంటే ఈ విమానాన్ని తొలుత స్నేహితురాలు నడపాల్సి ఉంది, కానీ బయలుదేరడానికి  అకస్మాత్తుగా కేవలం రెండు గంటల ముందు, దీపికను ఆమె స్థానంలోకి  రావాలని ఆదేశాలందాయి.  ఈ బాధ్యతను అత్యంత  సాహసోపేతంగా నిర్వహించి అందరి ప్రశంసలు దక్కించుకుంది.

ఎదురైన సవాళ్లు :  ఈ రెస్క్యూ మిషన్‌ సమయంలో ఒక దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపు నెట్‌వర్క్ ఫెయిల్యూర్ కావడంతో ఉత్కంఠ నెలకొంది, కానీవెంటనే సంబంధాలు పునరుద్ధరించబడటంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.

ఎవరీ దీపిక అధానా
హర్యానాలోని ఫరీదాబాద్ (తిగావ్ ప్రాంతం) చెందిన వారు దీపిక. తండ్రి యోగేష్ అధానా (ఆర్కిటెక్ట్), తల్లి బబ్లీ అధానా.  ఆమె తాతయ్య అమృత్ సింగ్ అధానా కోరిక మేరకు దీపికా పైలట్ కావాలని నిర్ణయించుకుంది. 2020లో 12వ తరగతి పూర్తి చేసిన ఆమె, కరోనా కష్టకాలంలోనూ పట్టుదలతో చదివి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది.

ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌, యూజర్లు గగ్గోలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)