Breaking News

‘ఎమ్మెల్యే సాబ్‌ మీకే ఓటు వేశా.. నా పెళ్లి చేయండి ప్లీజ్‌’

Published on Fri, 10/18/2024 - 09:23

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు ఓటు వేసినందుకు తనకు పెళ్లి చేయాలని కోరాడు ఓ వ్యక్తి.  ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో, వారి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.

వివరాల ప్రకారం.. యూపీలోని చర్ఖారీ నియోజకవర్గానికి బ్రిజ్‌భూషణ్‌ రాజ్‌పుత్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ పర్యటించిన అనంతరం.. బ్రిజ్‌భూషణ్‌ తన వాహనంలో వెళ్తూ మహోబా ప్రాంతంలో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు ఒక బంక్ వద్ద కారును ఆపారు. ఈ సందర్భంగా అక్కడే పనిచేస్తోన్న స్థానిక వ్యక్తి అఖిలేంద్ర ఖరే.. ఎమ్మెల్యేను చూసి ఆయన వద్దకు వచ్చారు.

అయితే, అఖిలేంద్ర ఖరే తనను ఏదైనా అడిగేందుకు వస్తున్నాడని ఎమ్మెల్యే భావించారు. ఇంతలో ఎమ్మెల్యే వద్దకు వచ్చిన అఖిలేంద్ర.. సర్‌ నా ఓటు మీకే వేశాను. దయచేసి నాకు పెళ్లి చేయండి ప్లీజ్‌ అని అడిగాడు. దీంతో, ఖంగుతున్న ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్‌.. నీ వయసెంత అని అడిగాడు.. 44 అని చెప్పడంతో.. మరి ఎలాంటి అమ్మాయి కావాలేంటి? అని ఎదురు ప్రశ్న వేశారు.

దానికి ఖరే బదులిస్తూ.. కొన్ని వర్గాలకు చెందిన వారు వద్దని సమాధానం ఇవ్వగా.. అలా ఎప్పుడూ వివక్ష చూపకూడదని, ఎవరితో రాసిపెడితే వారితోనే వివాహం జరుగుతుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో నీకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నా. నాకు ఓటేశావు కదా.. నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది.

 

ఇది కూడా చదవండి: వయనాడ్‌లో ప్రియాంక ప్రత్యర్థి సత్యన్‌ మొకెరి

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)