Breaking News

ఐపీఎల్ ఫైనల్‌పై రాజకీయం? డీకే శివకుమార్

Published on Mon, 06/01/2026 - 00:08

బెంగళూరు: ప్రస్తుతం "రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు" ఫ్యాన్స్ పుల్‌ఖుషీతో ఉన్నారు.  ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్‌ ఛాంపియన్స్‌గా నిలవడంతో సంతోషంతో ఉబ్బితబ్బవుతున్నారు.  ఓవైపు ఆర్సీబీ గెలుపుతో ఫ్యాన్స్‌ జోష్‌ మీదుంటే  కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి. 

డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడాతూ "నిజానికి ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరగాల్సింది. కానీ మాకు అన్యాయం చేశారు. కేవలం రాజకీయం కారణంగానే ఈ మ్యాచ్‌ను అక్కడికి (అహ్మదాబాద్) తరలించారు. దీనిపై నేను ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను" అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఫైనల్ బెంగళూరులో ఫైనల్ జరిగి ఉంటే నగరానికి అది ఒక చారిత్రాత్మక సందర్భం అయ్యేదని, కానీ స్థానిక అభిమానులు ఆ అద్భుత క్షణాన్ని కోల్పోయారని అన్నారు. అయినప్పటికీ, ఈ సీజన్ అంతటా జట్టుకు అండగా నిలిచిన కర్ణాటక అభిమానులకు, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా  శివకుమార్ ప్రమాణస్వికారం చేసే అవకాశం ఉంది.

కాగా ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. GT 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా విరాట్‌ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలిపించారు. కాగా ఆర్సీబీ గతేడాది సైతం ఐపీఎస్ టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)