Breaking News

‘సింధు ఒప్పందం’పై పాక్‌కు కంగుతినిపించిన అమిత్ షా

Published on Sun, 06/22/2025 - 07:57

న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాక్‌- భారత్‌ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ  నేపధ్యంలోనే భారత్.. పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.‌ అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్‌ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మరోమారు ఈ విషయంలో భారత్‌ వైఖరిని స్పష్టం చేశారు.

ఇస్లామాబాద్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్‌కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని హోంమంత్రి అమిత్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన అనంతరం సింధు నదీ వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని మూడు నదుల నీటిని పాకిస్తాన్‌లోని 80శాతం పొలాలకు  అందించేందలా నాడు ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన అమిత్‌ షా.. ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్‌కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఈ ఒప్పందంపై చర్చల కోసం తపిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయాలని ఇస్లామాబాద్  యోచిస్తున్నదని సమాచారం.

ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్‌ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)