Breaking News

గుడిలో ఘోరం.. 35కి చేరిన మృతుల సంఖ్య

Published on Fri, 03/31/2023 - 08:36

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య  35కి చేరింది. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. 

మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల ద్వారా 14 మందిని రక్షించగలిగాం. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరికొందరు కనిపించడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు. కానీ, అధికారుల దగ్గర ఒక్కరే కనిపించకుండా పోయారన్న సమాచారం ఉంది. అందుకే సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాం అని ఇండోర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌(కలెక్టర్‌) ఇళయరాజా చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్‌ ఆపరేషన్‌.. ఇంకా కొనసాగుతూనే ఉందని మెజిస్ట్రేట్‌ వెల్లడించారు.  

ఇండోర్‌ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్‌ ట్రస్ట్‌ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు. 

ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్‌ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. 

అయితే ఇండోర్‌ మున్సిపల్‌ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్‌లోనే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్‌ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్‌ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది. 

శ్రీరామ నవమి సందర్భంగా.. మెట్లబావిని కవర్‌ చేస్తూ వేసిన కాంక్రీట్‌ స్లాబ్‌పై ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. అయితే అది తేలికపాటి స్లాబ్‌ అని, 30 నుంచి 40 మందికి మించిన బరువును మోయలేదంటున్నారు స్థానికులు. అందుకే కుప్పకూలి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఘటనపై మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి