భారతీయులను రప్పించే యత్నాలు షురూ 

Published on Tue, 03/03/2026 - 04:47

న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందుకోసం మంగళవారం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి పది ఇండిగో విమాన సరీ్వసులను ఆరంభించనుంది. జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు సర్వీసులు ఆరంభం కానున్నాయి. ‘‘ప్రత్యేక విమానాల్లో సౌదీ నుంచి భారతీయులను మంగళవారం నుంచి తీసుకొస్తాం. 

జెడ్డాలోని ఇండియా కాన్సులేట్‌ జనరల్‌తో ఇండిగో సమన్వయంతో పనిచేస్తుంది’’ అని పౌర విమానయాన శాఖ పేర్కొంది. వారిని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. జల్నా ఎంపీ కల్యాణ్‌ కాలే, మరో 9 మంది పర్యాటకులు దుబాయ్, అబూదాబిలో చిక్కుకున్నారని ఎంపీ సోదరుడు జగన్నాథ్‌ చెప్పారు.

 పుణె సమీప పింప్రీ చింద్వాడ్‌లోని ఇందిరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు చెందిన నలుగురు అధ్యాపకులు, 84 మంది విద్యార్థులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 26న పుణె జిల్లా నుంచి వెళ్లిన 300 మంది ప్రయాణికులూ దుబాయ్‌లోనే చిక్కుకున్నారు. కన్నడిగులను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)