Breaking News

విమానంలో వృద్దురాలు మృతి.. అత్యవసర ల్యాండింగ్‌

Published on Mon, 04/07/2025 - 16:01

ఔరంగాబాద్‌: విమానంలో ప్రయాణిస్తున్న ఒక వృద్దురాలు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి ముంబై నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. విమానంలో ప్రయాణిస్తున్న వృద్దురాలు సుశీలా దేవి(89) అస్వస్థతకు గురయ్యింది. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, విమాన సిబ్బంది వెంటనే  స్పందించారు. అక్కడికి సమీపంలోని చత్రపతి సంభాజీనగర్‌లోని చికల్థానా విమానాశ్రయం(ఔరంగాబాద్‌ విమానాశ్రయం, మహారాష్ట్ర)లో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో  ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయింది.

అక్కడికి చేరుకున్న వైద్య బృందం సుశీలా దేవిని పరీక్షించింది. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వారు నిర్ధారించారు. విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అస్వస్థతకు గురైనప్పుడు విమానం గాలిలో  ఉంది. సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అత్యవసర ల్యాండింగ్(Emergency landing) తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు అవసరమైన చట్టపర ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం ఆ ఇండిగో విమానం వారణాసి వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.

కాగా సుశీలా దేవి మృతదేహాన్ని చత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గత నెలలో జైపూర్ నుండి చెన్నైకి వెళుతున్న విమానానికి సంబంధించిన టైర్ పేలిన ఘటన జరిగింది. అయితే ఈ  ఉదంతంలో ఎవరూ గాయపడలేదు. ఈ రెండు సంఘటనలు విమాన ప్రయాణంలో భద్రత, అత్యవసర చర్యల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. 

ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్‌ 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)