Breaking News

వరల్డ్ బెస్ట్ ఇండియన్ మద్యం బ్రాండ్.. ఫుల్లు రూ. 2వేలే!

Published on Tue, 05/06/2025 - 16:21

భారతీయులు స్వభావ సిద్ధంగా బలమైన, గాఢమైన రుచులను రంగులను ఇష్టపడతారు అందుకేనేమో మన దేశంలో మద్యం వినియోగంలో  విస్కీ, బ్రాండీ, రమ్, బీర్‌ లకే ఎక్కువ డిమాండ్‌. అయితే విస్కీ, బ్రాందీ, రమ్‌లకు  బ్రిటిష్‌ పాలన నాటి నుంచే ఆదరణ బాగా ఉంది. ముఖ్యంగా విస్కీ,ఎప్పటి నుంచో మద్యం ప్రియులకు ప్రధాన ఎంపికగా నిలిచింది. రమ్‌ బ్రాందీ విస్కీలు అందరికీ అందుబాటు ధరలలో సులభంగా లభించే మద్యం రకాలుగా మారాయి.వోడ్కా కూడా ఇటీవలి కాలంలో పుంజుకుంటుండగా. వీటన్నింటి తర్వాత స్థానం వైన్‌కు దక్కింది. 

అయితే మన దేశంలోని మద్యపాన ప్రియుల్లో అనేకమంది  దాదాపుగా మర్చిపోయిన ఒక మద్యం వెరైటీ ఒకటి ఉంది అది జిన్‌. లైట్‌ కలర్‌లో,  సున్నితమైన రుచులతో ఉండటంతో, భారతీయ అభి‘రుచుల’ను అది అంతగా సంతృప్తి పరచలేకపోయింది. అంతేకాకుండా   జిన్‌  గురించి  ప్రచారం కూడా తక్కువే. అందుకే చాలా మందిలో జిన్‌ ను ఎలా తాగాలో, ఏ కాక్‌టెయిల్స్‌లో ఉపయోగించాలో అవగాహన లేకపోయింది. దాంతో పెద్దగా ఎవరూ పట్టించుకోని రకంగా జిన్‌ మిగిలిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే  విస్తరిస్తున్న గ్లోబల్‌ కాక్‌టెయిల్‌ కల్చర్‌  జిన్‌ వినియోగానికి ఊపునిస్తోంది. తరచుగా  కాక్‌టెయిల్స్‌లో కలుపుకుని జిన్‌ను సేవించడం ఓ ప్రత్యేకమైన వెస్ట్రన్‌ డ్రింకింగ్‌ కల్చర్‌. ఇలాంటి శైలి ఇప్పుడ మను నగరాల్లో మాత్రమే క్రమంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్‌ దాన్, హాపుసా వంటి భారతీయ క్రాఫ్ట్‌ జిన్‌ల ఆవిర్భావంతో, నగరాల్లో యువత, ప్రయోగాలకు వెరవని ఆల్కహాల్‌ ప్రియుల వల్ల జిన్‌ కు ఆదరణ పెరుగుతోంది. 

ఈ నేపధ్యంలోనే మన దేశానికి చెందిన ఒక జిన్‌ బ్రాండ్‌ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్‌ వన్‌గా నిలిచింది. సాధారణంగా మన దేశీయ మద్యం రకాలు ప్రపంచ పోటీలో నిలవడం అరుదు. అలాంటిది ఏకంగా విజేతగా  గెలుపొందడం  చెప్పుకోదగిన విషయమే. భారతదేశంలో తయారైన జిన్‌ బ్రాండ్‌ ’జిన్‌ జిజి’ ఇటీవల లండన్‌లో నిర్వహించిన పోటీల్లో ’స్పిరిట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2025’ అనే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది.  ఈ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ మద్యం ఉత్పత్తులకు ఇస్తారు.  

జిన్‌ జిజి  గోవాలో తయారవుతుంది.  ఇది హిమాలయ జునిపర్, తులసి, దార్జిలింగ్‌ టీ, క్యామొమైల్‌ వంటి భారతీయ సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు.  ఈ ప్రత్యేకమైన సుగంధాలు దీనికి ప్రత్యేకతను అందిస్తున్నాయి.   ప్రపంచవ్యాప్తంగా భారతీయ మద్యం బ్రాండ్లకు గుర్తింపు తీసుకువచ్చిన జిన్‌ జిజి... ధర రూ.2వేల దగ్గర్లోనే ఉండడం  కూడా మరో విశేషం. సాధారణంగా ఇలా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్స్‌ ధర కనీసం రూ.5వేల పైమాటే ఉంటుంది. అయితే  జిన్‌ చోటా మోటా వైన్‌ షాప్స్‌లో దొరకకపోవచ్చు. డ్రింక్స్‌.ఇన్‌ వంటి వెబ్‌సైట్లలో ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రీమియం మద్యం దుకాణాల్లో కూడా లభించవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)