Breaking News

ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్‌ : ధర ఎంతో తెలుసా?

Published on Wed, 11/26/2025 - 17:44

HR88B8888  తమకెంతో ఇష్టమైన కార్లకోసం అంతకంటే ఇష్టమైన, నచ్చిన నంబర్లతో నంబర్‌ ప్లేట్లను  దక్కించుకోవడం చాలామంది అలవాటు. వీటినూ వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు అని పిలుచుకుంటారు. అలా  భారతదేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది. తాజా వేలంలో ఫలితంగా రికార్డు బద్దలైంది.పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.

హర్యానాలో వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం వారానికి ఆన్‌లైన్ వేలం జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల మధ్య, బిడ్డర్లు తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ఆపై బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు ప్రకటించే వరకు fancy.parivahan.gov.in పోర్టల్‌లో  అధికారిక వేలం జరిగింది.

ఈ వారం, బిడ్డింగ్ కోసం వచ్చిన అన్ని నంబర్లలో, 'HR88B8888' రిజిస్ట్రేషన్ నంబర్ అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను అందుకుంది . మొత్తం 45 అభ్యర్థనలొచ్చాయి.  మొత్తానికి  అమ్ముడైంది! బేస్ బిడ్డింగ్ ధరను రూ. 50,000గా నిర్ణయించారు. ఇది ప్రతి నిమిషం పెరుగుతూ సాయంత్రం 5 గంటలకు రూ. 1.17 కోట్లకు స్థిరపడింది. బుధవారం హర్యానాలో రూ.1.17 కోట్లకు అమ్ముడైంది.  ప్రస్తుతం 'HR88B8888' నంబర్ ప్లేట్ అధికారికంగా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కార్ రిజిస్ట్రేషన్ నంబర్.

 చదవండి: ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ : ఎంతవరకు సేఫ్‌, ఎలా బుక్‌ చేసుకోవాలి?

HR అనేది రాష్ట్ర కోడ్, 88 వాహనం నమోదు చేయబడిన హర్యానాలోని నిర్దిష్ట ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లాను సూచిస్తుంది. నిర్దిష్ట RTOలో వాహన సిరీస్ కోడ్‌ను సూచించడానికి B ఉపయోగిస్తారు. 8888 అనేది వాహనానికి కేటాయించిన ప్రత్యేకమైన, నాలుగు అంకెల రిజిస్ట్రేషన్ నంబర్.ఈ నంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏమిటంటే, 'B' ని పెద్ద అక్షరంలో పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిది  నెంబరు లానే కనిపిస్తుంది  ఒకే అంకె 8 పునరావృతమవుతుంది.

 ఇప్పటివరకు ఈ రికార్డు కేరళకు చెందిన వ్యక్తి పేరిట ఉంది. ఆయన  రూ. 46 లక్షల విలువైన నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేశారు.  ఈ సంవత్సరం ప్రారంభంలో, ఏప్రిల్‌లో, కేరళకు చెందిన టెక్ బిలియనీర్ వేణు గోపాలకృష్ణన్ తన లంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మంటే "KL 07 DG 0007" కోసం రూ. 45.99 లక్షల ఖర్చుతో VIP లైసెన్స్ ప్లేట్‌ను కొనుగోలు చేశారు..

ఇవీ చదవండి: మూడు పిట్‌ బుల్స్‌ దాడి : కేర్‌ టేకర్ అమెరికా యువతి దుర్మరణం
ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ : ఎంతవరకు సేఫ్‌, ఎలా బుక్‌ చేసుకోవాలి?


 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)