Breaking News

భయంగా బతికాం 

Published on Sun, 01/18/2026 - 04:44

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉది్వగ్న పరిస్థితులు కనిపించాయి. ఇరాన్‌ నుంచి క్షేమంగా తిరిగివచ్చిన తమ కన్నబిడ్డలను చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆనందభాష్పాలతో స్వాగతం పలికారు. ఆత్మీయులు, కుటుంబ సభ్యుల కోసం పెద్ద సంఖ్యలో జనం ఎయిర్‌పోర్టుకు తరలిచ్చారు. 

ఇరాన్‌లో కొన్ని రోజులుగా ప్రజల ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండడం, శాంతి భద్రతలు దిగజారుతుండడంతో అక్కడున్న భారతీయులు కమర్షియల్‌ విమానాల్లో శుక్రవారం అర్ధరాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్‌ నుంచి తిరిగిరావాలని భారత ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారు లు, పవిత్ర క్షేత్రాల దర్శనానికి వెళ్లిన భక్తులు ఇరాన్‌లో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వారు స్వదేశానికి తిరిగిరావడానికి భారత విదేశాంగ శాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహకరించాయి. అతిత్వరలో మరికొందరు భారతీయులు ఇరాన్‌ నుంచి తిరిగి రానున్నట్లు సమాచారం.  

వ్యవస్థలు స్తంభించిపోయాయి  
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత పలువురు తమ భయానక అనుభవాలను వ్యక్తంచేశారు. ఇరాన్‌లో అక్షరాలా యుద్ధ వాతావరణమే నెలకొందని వెల్లడించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రతిక్షణం భయంభయంగా బతికామని అన్నారు. అక్కడ పరిస్థితులు నానాటికీ భీకరంగా మారుతున్నాయని, బయటకు వెళితే ప్రాణాలతో తిరగి వస్తామన్న గ్యారంటీ లేదని తెలిపారు. వ్యవస్థలన్నీ దాదాపు స్తంభించిపోయాయని, ఇంటర్నెట్‌ సేవలను ఆపేశారని, ఫోన్లలో మాట్లాడుకొనే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. అక్కడ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా అశాంతి కనిపిస్తోందని వివరించారు.    

నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది  
‘‘నెల రోజుల క్రితం ఇరాన్‌ వెళ్లాం. కానీ, రెండు వారాల క్రితమే సమస్యలు మొదలయ్యాయి. బయటకు వెళితే నిరసనకారులు అడ్డుకొనేవారు. మా వాహనాన్ని ముందుకు వెళ్లనిచ్చేవారుకాదు. చేసేది లేక మా నివాసానికి తిరిగి వచ్చేవాళ్లం. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. ఎప్పుడు ఎక్కడేం జరుగుతోందో తెలిసేది కాదు. మా క్షేమ సమాచారాలను ఇండియాలోని కుటుంబ సభ్యులకు చేరవేసే అవకాశం కూడా దక్కలేదు. నిత్యం భయంగా బతకాల్సి వచ్చింది. అది నిజంగా చాలా కష్టమైన సమయం. మొత్తానికి భారత ఎంబసీ సహకారంతో బయటపడ్డాం’’అని ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు.  

సొంత ఖర్చుతోనే వచ్చా..  
‘‘నేను ఇరాన్‌లో షిరాజ్‌ నగరంలో ఉన్న మెడికల్‌ కాలేజీలో చదుకుంటున్నా. కానీ, ఇంటర్నెట్‌ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అసలేం జరుగుతోందో తెలిసేదికాదు. భారత ప్రభుత్వ సూచనతో స్వదేశానికి తిరిగివచ్చా. నేను సొంత ఖర్చుతోనే వచ్చా. ప్రభుత్వం మాకోసం ప్రయాణ ఏర్పాట్లు చేయలేదు’’అని ఓ వైద్య విద్యారి్థని తెలియజేశారు.  

9 వేల మంది భారతీయులు  
ఇరాన్‌ నుంచి ఎంతమంది తిరిగి వచ్చారన్నది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇరాన్‌లో ప్రస్తుతం దాదాపు 9 వేల మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్‌ జైస్వాల్‌ చెప్పారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వారిని క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఎవరూ ఇరాన్‌కు వెళ్లే ప్రయత్నం చేయొద్దని కోరారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)