Breaking News

భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయ పాలనే.. బుల్‌డోజర్‌ పాలన కాదు

Published on Sat, 10/04/2025 - 05:55

న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయ పాలనే తప్ప, బుల్‌డోజర్‌ న్యాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుతోటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రభుత్వమే జడ్జి, లాయర్, అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 ఏళ్లలో ‘చట్ట పాలన’పరిణతి చెందుతూ వస్తోందన్నారు. 

చట్ట పాలన కేవలం నిబంధనావళి మాత్రమే కాదు, నైతిక చట్టం ఇది విభిన్న, సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్రమని ఆయన అన్నారు. 

నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను కూల్చడం చట్ట పరమైన ప్రక్రియలను మరుగు పర్చడం, నియమాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందంటూ యూపీ ప్రభుత్వంపై కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ పేర్కొనడం తెల్సిందే. వివిధ కేసుల్లో చారిత్రక తీర్పులను ఈ ప్రసంగం సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ ఉదహరించారు. ‘రూల్‌ ఆఫ్‌ లా ఇన్‌ ది లార్జెస్ట్‌ డెమోక్రసీ’అంశంపై మారిషస్‌లో జరిగిన వార్షిక సర్‌ మౌరిస్‌ రౌల్ట్‌ స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మారిషస్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా 1978–82 సంవత్సరాల్లో జస్టిస్‌ రౌల్ట్‌ పనిచేశారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)