Breaking News

ఇలా ‘భాషించారు’! 

Published on Sun, 03/31/2024 - 05:02

మీరు ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ‘చాయ్‌ పే చర్చ’ వీడియో చూశారా? అందులో ఓ విషయం గమనించారా? మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అర్థమవుతున్నట్లు బిల్‌గేట్స్‌ తలాడించడం, తిరిగి బదులివ్వడం చేశారు. బిల్‌గేట్స్‌కు హిందీ రాదుగా.. మరి ఇదెలా సాధ్యమైంది? ఈ చర్చలో వారు ప్రధానంగా మాట్లాడుకున్న ఏఐ (కృత్రిమ మేథ)దే ఈ మాయ అంతా. అంటే ఏఐ సాయంతో అప్పటికప్పుడు రియల్‌ టైంలో ఆంగ్లంలోకి అనువాదమైపోవడమన్న మాట. ఇంతకు ముందు కూడా.. అంటే.. గతేడాది డిసెంబర్‌లో వారణాసిలో జరిగిన ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారతీయ భాషలను రియల్‌ టైంలో అనువదించగల ఏఐ ఆధారిత టూల్‌ ‘భాషిణి’ని ఆవిష్కరించారు.

ఆపై ఆ వేదిక నుంచే దాన్ని ఉపయోగించారు కూడా. అంటే మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అక్కడ ఇయర్‌ బడ్స్‌ పెట్టుకున్న తమిళులకు వారి భాషలోకి అనువాదమై.. వినిపించింది. అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ టూల్‌ను ఉపయోగించే వివిధ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చాయ్‌ పే చర్చ కూడా ఇలాంటి ఏఐ ఆధారిత భాషానువాద టూల్‌ ద్వారానే సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. మీకో విషయం తెలుసా? త్వరలో స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్‌.. తమ తదుపరి మోడల్‌ ఐఫోన్‌–16లో రియల్‌ టైం ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ సహా మరికొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుందట.   

భాషిణి ఎలా పనిచేస్తుందంటే.. 
భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషానువాద టూల్‌. యాండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎవరైనా వ్యక్తులు ఇతర భాషల వారితో మాతృ భాషలో మాట్లాడినా అది ఆయా భాషల్లోకి అప్పటికప్పుడే అనువదించేస్తుంది. దేశంలోని భిన్న భాషలు మాట్లాడే వారి మధ్య భాషా సమస్యను ఇది తొలగిస్తుంది. నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌తోపాటు క్రౌడ్‌ సోర్సింగ్‌ ద్వారా పొందిన (భాషాదాన్‌) వివిధ భాషల పదాలతో తయారు చేసుకున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువదిస్తుంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)