Breaking News

యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ

Published on Fri, 07/04/2025 - 04:52

లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్‌ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. 

వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్‌ఎస్‌లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్‌లోని నయార్‌కుళి ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. 

శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్‌ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్‌ఎస్‌కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్‌ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. 

‘‘ ఐఎస్‌ఎస్‌లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్‌కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్‌ బ్యాగ్‌ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. 

‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్‌ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్‌గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్‌ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్‌ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్‌’తో చెప్పింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)