Breaking News

త్వరలో భారత్‌-చైనాల మధ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభం?

Published on Tue, 11/19/2024 - 20:09

బ్రెసిలియా : భారత్‌-చైనాల మధ్య శాంతియుత వాతావరణం నెలకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌-చైనాల మధ్య శాంతి కుదిరేలా భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యిల భేటీ జరిగింది. ఈ భేటీలో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలను పునరుద్ధరించడంతోపాటు కైలాష్ మానసరోవర్ యాత్ర  పునఃప్రారంభంపై ఇరు దేశాలు చర్చించినట్లు సమాచారం.

తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల పెట్రోలింగ్  ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. ఈ సమావేశం శాంతి, ప్రశాంతత పరిరక్షణకు దోహదపడిందని మంత్రులు పేర్కొన్నారు.

కాగా,2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఈ పరిస్థితుల వల్ల ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. వాటిని నివారించేందుకు భారత్‌-చైనా మధ్య అనేక చర్యలు జరిగాయి. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)