Breaking News

ప్రజారోగ్య విప్లవం ఆయుష్మాన్‌ భారత్‌ 

Published on Wed, 09/24/2025 - 05:58

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ప్రజారోగ్య రంగంలో ఈ పథకం ఒక విప్లవం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ఆయుష్మాన్‌ భారత్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలను చౌకగా అందించడమే లక్ష్యమని వివరించారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతోందని, ఎంతో వెసులుబాటు లభిస్తోందని అన్నారు. 

దేశ పౌరులు గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఆయుష్మాన్‌ భారత్‌ తోడ్పడుతున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. నిధుల వ్యయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో మానవాభివృద్ధిలో మనం సాధిస్తున్న ప్రగతికి ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ పథకం పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 42 కోట్లకుపైగా ఆయుష్మాన్‌ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా మారిందని స్పష్టంచేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ అమలుతో ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 29 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని వెల్లడించారు.

 అదేసమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు చేస్తున్న 63 శాతం నుంచి 39 శాతానికి తగ్గిపోయినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఆర్థిక భారం నుంచి లక్షలాది కుటుంబాలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. అనారోగ్యం పాలైతే ఆయుష్మాన్‌ భారత్‌ ఆదుకుంటోందని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం 2018 సెపె్టంబర్‌ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదలతోపాటు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య బీమాను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌తో ప్రతిఏటా ఆ రు కోట్లకుపైగా కుటుంబాలు పేదరికంలోకి జారిపోకుండా లబ్ధి పొందుతున్నాయని కేంద్రం వెల్లడించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)