Breaking News

భారత్‌పై కెనడా మంత్రి ప్రేలాపనలు

Published on Sat, 11/02/2024 - 16:19

న్యూఢిల్లీ:  భారత్‌కు వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వ పెద్దల ప్రేలాపనలు ఆగడం లేదు. ఒకవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నప్పటికీ మరోవైపు వారు మరింత ఆజ్యం పోస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులపై దాడులకు, కుట్రలకు భారత హోంశాఖ మంత్రి అమిత్‌ షా కారణమంటూ కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్‌ మోరిసన్‌ చేసిన ఆరోపణలతో వివాదం మరింత ముదురుతోంది. మోరిసన్‌ మంగళవారం కెనడా జాతీయ భద్రతా కమిటీకి సంబంధించిన పార్లమెంట్‌ సభ్యులతో మాట్లాడుతూ అమిత్‌ షా ప్రస్తావన తీసుకొచ్చారు. 

కెనడాలో ఉన్న సిక్కు వేర్పాటువాదులకు, ఖలిస్తానీ సానుభూతిపరులకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించాలని, సిక్కులను భయాందోళనకు గురి చేయాలని, వారికి సంబంధించిన సమాచారం సేకరించాలంటూ భారత నిఘా అధికారులను అమిత్‌ షా ఆదేశించారని చెప్పారు. అయితే, అమిత్‌ షా ఈ ఆదేశాలిచి్చనట్లు కెనడాకు ఎలా తెలిసిందో మోరిసన్‌ వెల్లడించలేదు. 2023 జూన్‌లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జస్టిన్‌ ట్రూడో వైఖరితో భారత్‌–కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికే చాలావరకు క్షీణించాయి. అయినా కూడా కెనడా మంత్రి మోరిసన్‌ నోరుపారేసుకోవడం గమనార్హం.  

కెనడా హైకమిషన్‌ ప్రతినిధికి నిరసన  
కెనడా మంత్రి డేవిన్‌ మోరిసన్‌ చేసిన ఆరోపణలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. అర్థంపర్థం లేని, ఆధారాల్లేని ఆరోపణలు చేశారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్‌ జైస్వాల్‌ మండిపడ్డారు. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన భారత్, కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అసంబద్ధమైన ఆరోపణలతో పరిస్థితిని దిగజార్చవద్దని సూచించారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసే కుతంత్రాలు మానుకోవాలని కెనడాకు స్పష్టంచేశారు. కెనడా మంత్రులు, అధికారులు భారత్‌ గురించి అంతర్జాతీయ మీడియాకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు లీకులు ఇస్తున్నారని రణ«దీర్‌ జైస్వా ల్‌ ఆరోపించారు. కెనడా మంత్రి మోరిస్‌ తాజా ఆరోపణల పట్ల భారత్‌లోని కెనడా హైకమిషన్‌ ప్రతినిధిని పిలిపించి, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని తెలిపారు.  

కెనడాలో భారత కాన్సులర్‌ సిబ్బందికి వేధింపులు  
కెనడాలోని భారత కాన్సులర్‌ సిబ్బందిని కెనడా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని రణ«దీర్‌ జైస్వాల్‌ ఆరోపించారు. వారిపై ఆడియో, వీడియో నిఘా పెట్టిందని చెప్పారు. సిబ్బంది మధ్య సమాచార మారి్పడిని అడ్డుకుంటోందని వెల్లడించారు. తరచుగా వేధించడంతోపాటు భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. దౌత్యపరమైన నిబంధనలు, ఒప్పందాలను కెనడా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. దీనిపై తమ నిరసనను కెనడా ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)