Breaking News

పాకిస్తాన్‌పై నీటి యుద్ధం.. భారత్‌ సంచలన నిర్ణయం

Published on Sun, 05/04/2025 - 12:03

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ చుక్కలు చూపిస్తోంది. పాక్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. తాజాగా బాగ్‌లిహార్‌ ఆనకట్ట నుంచి పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. పాక్‌ను ఎండగట్టే చర్యల్లో భాగంగా ఇది రెండో ప్రతీకార చర్యగా చెప్పుకోవచ్చు.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు భారత్‌ వరుస షాక్‌లిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాగ్‌లిహార్‌ ఆనకట్ట నుంచి పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్‌ స్లూయిస్‌ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. 

ఇది స్వల్పకాల చర్యగా అక్కడి అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో అవసరమైతే భారత్‌  కఠిన చర్యలు  తీసుకోగలదని పాక్‌కు తెలియజేసినట్లైందన్నారు. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, సింధు జలాల ఒప్పందం కింద పాక్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్‌ కూడా ఒకటి. పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఎక్కువగా పంటపొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఈ డ్యామ్‌ను చీనాబ్‌ నదిపై 2008లో నిర్మించారు.

ఇక, పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్‌ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఆ తర్వాత 29 నాటికే ఈ డ్యామ్‌ నుంచి పాకిస్తాన్‌కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పాక్‌లోని సియాల్‌ కోట్‌ వద్దకు వచ్చేసరికి చినాబ్‌ పూర్తిగా ఎండిపోయింది. పాక్‌లోని పంజాబ్‌లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్‌ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్‌ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇలా తరచూ నిర్ణయాలు తీసుకుంటూ పాక్‌కు భారత్‌కు చుక్కలు చూపిస్తోంది. 

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!