Breaking News

చిప్‌ రంగంలో స్వయం సమృద్ధి!

Published on Tue, 02/10/2026 - 06:15

సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్‌ ప్రపంచంలో ’ఆత్మనిర్భర్‌ భారత్‌’నినాదానికి బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్‌ రంగానికి వెన్నెముక లాంటి సెమీకండక్టర్ల (చిప్స్‌) తయారీలో దేశాన్ని అగ్ర స్థానానికి చేర్చేందుకు ’ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0’(ఐఎస్‌ఎం 2.0)కు శ్రీకారం చుట్టింది. 2026–27 బడ్జెట్‌లో ఈ మిషన్‌ కోసం ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. పరిశోధన, శిక్షణ, పరికరాల తయారీపై దృష్టి సారిస్తూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దేశీయ టెక్నాలజీని అభివద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని కేంద్రం ప్రకటించింది.

ఆ మూడు దేశాలదే పెత్తనం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీలో తైవాన్, చైనా, కొరియా దేశాల ఆధిపత్యం నడుస్తోంది. కోవిడ్‌ సమయంలో చిప్స్‌ సరఫరా చైన్‌ దెబ్బతినడంతో మొబైల్స్‌ నుంచి కార్ల తయారీ వరకు అన్నీ స్తంభించిపోయాయి. ఈ చేదు అనుభవాల దష్ట్యా, సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడకూడదని భారత్‌ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ‘మేక్‌ ఇన్‌ ఇండియా –మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

అప్పుడు ఐఎస్‌ఎం 1.0 సూపర్‌ హిట్‌..
కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించిన తొలి దశ (ఐఎస్‌ఎం 1.0) విజయవంతమైంది. రూ.76 వేల కోట్ల ప్రోత్సాహకాలతో మొదలైన ఈ ప్రయాణంలో డిసెంబర్‌ 2025 నాటికి ఏకంగా రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో 10 భారీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఇప్పుడు ఐఎస్‌ఎం 2.0 ద్వారా కేవలం చిప్స్‌ అసెంబ్లింగ్‌ మాత్రమే కాకుండా ముడి సరుకులు, పరికరాలు, డిజైనింగ్‌ కూడా భారత్‌లోనే జరిగేలా ప్రణాళిక రచించారు.

2026–27 బడ్జెట్‌ లక్ష్యం ఇదే..
సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీ ఎకోసిస్టమ్‌ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 8,000 కోట్ల భారీ ప్రణాళిక రూపొందించారు. రూ. 4,000 కోట్ల పెట్టుబడితో మరో కొత్త చిప్‌ తయారీ యూనిట్‌ ద్వారా 1,500 మందికి ఉపాధి కల్పించానున్నారు. రూ. 11,000 కోట్ల పెట్టుబడితో 9 కొత్త ఏటీఎంపీ/ఓశాట్‌ అసెంబ్లింగ్‌ యూనిట్ల ద్వారా 3,000 మందికి ఉపాధి ఇవ్వనున్నారు. అంతేగాక 30 డిజైన్‌ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు 10 కొత్త చిప్‌ ఐపీ కోర్లను అభివృద్ధి చేయనున్నారు. 

మన సొంత చిప్‌ ’ధ్రువ్‌–64’విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా సీ–డాక్‌ ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ’ధ్రువ్‌– 64’మైక్రోప్రాసెసర్‌ ఒక గేమ్‌ ఛేంజర్‌. 5జీ, ఆటోమొబైల్, రక్షణ రంగాల్లో దీని వినియోగం కీలకం కానుంది.

2035 నాటికి టాప్‌ ప్లేస్‌లో..
భారత సెమీకండక్టర్‌ మార్కెట్‌ 2030 నాటికి 100–110 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. 2029 నాటికి దేశీయ అవసరాల్లో 70–75 శాతం చిప్స్‌ మన దగ్గరే తయారయ్యేలా చూడటం, 2035కల్లా ప్రపంచంలోని టాప్‌ సెమీకండక్టర్‌ దేశాల సరసన భారత్‌ నిలవడం ఈ మిషన్‌ అంతిమ లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. రాబోయే రోజుల్లో దేశీయంగా 3–నానోమీటర్, 2–నానోమీటర్‌ అత్యాధునిక చిప్స్‌ తయారీ ప్రణాళిక కార్యరూపం దాల్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)