Breaking News

పాక్‌-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్‌ స్పందన ఇదే..

Published on Thu, 09/18/2025 - 10:34

న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదరడంపై భారత్‌ స్పందించింది. ఆ ఇరు దేశాల ఒప్పందంలో వివరాల ప్రకారం.. ఇరు దేశాలలోని ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇరు పక్షాలపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అప్పుడు ఆ ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ ఒప్పందపు పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తామని వెల్లడించింది. 

‘సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య కుదిరిన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు వచ్చిన నివేదికలను చూశాం. రెండు దేశాల మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామ ప్రక్రియ పరిశీలనలో ఉందని భారత ప్రభుత్వానికి తెలుసు. మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామం వలన వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తాం. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ప్రధాని.. రియాద్‌ను సందర్శించారు  అక్కడి అల్-యమామా ప్యాలెస్‌లో సౌదీ యువరాజు షరీఫ్‌ను కలిశారు.  సౌదీ అరేబియా - పాకిస్తాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని అభివృద్ధి చేయడం, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఒప్పందపు ప్రకటన వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి.. భారతదేశం  చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్‌- సౌదీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కీలకమైనదిగా భావిస్తున్నారు.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)