Breaking News

ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి

Published on Thu, 07/20/2023 - 07:52

ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపడంతో విదేశాల నుంచి మనదేశానికి చెందిన పురాతన వస్తువులను తిరిగి తీసుకురావడంలో విజయం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్‌లో అమెరికా పర్యటన చేపట్టిన సమయంలో ఆయన భారత్‌కు చెందిన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన ప్రాచీన వస్తువులను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో అమెరికా స్మగ్గింగ్‌ రూపంలో వచ్చిన  105 పురాతన వస్తువులను న్యూయార్క్‌లో గల భారత కాన్సులేట్‌కు అప్పగించింది. 

ఇరు దేశాల సాంస్కృతిక ఆస్తి ఒప్పందం
వీటిలో రెండవ, మూడవ శతాబ్దాలు మొదలుకొని 18వ, 19వ శతాబ్దాల వరకు గల అనేక అరుదైన కళాఖండాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాతన కళాఖండాల అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించడంలో సహాయపడే సాంస్కృతిక ఆస్తి ఒప్పందం కోసం పని చేయడానికి భారతదేశం-అమెరికా అంగీకరించాయి. ఇటువంటి అవగాహన రెండు దేశాల అంతర్గత భద్రత, చట్ట అమలు సంస్థల మధ్య ద్వైపాక్షిక సహకారానికి దోహదపడుతుంది.  ఈ 105 కళాఖండాలు భారతదేశానికి చెందిన పురాతన సంస్కృతిని వివరిస్తాయి. 

మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించి..
వీటిలో తూర్పు భారతదేశానికి చెందిన 47, దక్షిణ భారతదేశానికి చెందిన 27, మధ్య భారతదేశానికి చెందిన 22, ఉత్తర భారతదేశానికి చెందిన 6, పశ్చిమ భారతదేశానికి చెందిన కొన్ని పురాతన ఆనవాళ్లు  ఉన్నాయి. వీటిలో 2వ, 3వ శతాబ్దాలు మొదలుకొని 18వ,19వ శతాబ్దం వరకు గల ఆనవాళ్లు ఉన్నాయి. వీటిలో టెర్రకోట, రాతితో చేసిన కళాఖండాలు, మెటల్, కలపతో రూపొందించిన ఆకృతులు ఉన్నాయి. వీటిలో దాదాపు 50 కళాఖండాలు మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలినవి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి. 

ఇప్పటివరకూ 278 పురాతన కళాకృతుల అప్పగింత
విదేశాలకు అక్రమంగా తరలిపోయిన భారత పురాతన వస్తువులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పురాతన వస్తువులను తిరిగి అందజేయడంపై భారత్‌- యూఎస్ మధ్య సన్నిహిత సహకారం ఉంది. 2016లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా తన దగ్గరున్న భారత్‌కు చెందిన 16 పురాతన ఆనవాళ్లను అందజేసింది. అదేవిధంగా 2021 సెప్టెంబర్‌లోనూ ప్రధాని మోదీ చొరవతో 157 భారత కళాఖండాలు అమెరికా నుంచి తిరిగి వచ్చాయి. 2016 నుంచి ఇప్పటివరకూ అమెరికా.. భారత్‌కు చెందిన మొత్తం 278 పురాతన కళాకృతులను తిరిగి అప్పగించింది.
ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్‌ విచారణలో సంచలన నిజాలు!
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)