Breaking News

బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్‌ తీవ్ర స్పందన

Published on Sat, 10/12/2024 - 17:52

ఢిల్లీ: జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురికావడం పట్ల తీవ్రంగా ఖండించింది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది.

‘‘ఢాకాలోని తంతిబజార్‌లో పూజా మండపంపై దాడి, జేశోరేశ్వరి కాళీమాత ఆలయంలో చోరీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా బాధాకరం. బంగ్లాదేశ్‌లోని హిందువులు సహా మైనారిటీలు, వారి ప్రార్థన మందిరాల భద్రత, మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలను తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. 

కాగా, 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాలోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపూర్‌లోని ఈ కాళీ ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి. స్థానిక కళాకారులు మూడు వారాల పాటు శ్రమించి దీన్ని తయారుచేశారు.

ఇదీ చదవండి: 50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్‌

 

 

 

Videos

ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ దద్దరిల్లిన హైదరాబాద్

సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు

వైభవ్ మాస్ రివెంజ్ తిలక్ కు దిమ్మతిరిగే షాక్

నీకూ అర్చనకు ఎన్ని గొడవలు.. కిట్టు మాట్లాడుతుంటే పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్

ప్రభాస్ కు KTR ప్రాంక్ కాల్

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

Photos

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)