Breaking News

‘హెచ్‌–1బీ’ కష్టాలపై అమెరికాతో చర్చిస్తాం 

Published on Sat, 12/27/2025 - 05:44

న్యూఢిల్లీ:  హెచ్‌–1బీ వీసా ఇంటర్వ్యూలు హఠాత్తుగా వాయిదా పడడం, తద్వారా అమెరికా ప్రయాణాలు ఆగిపోవడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు నాలుగైదు నెలలపాటు వాయిదా పడ్డాయి. వేలాది మంది భారతీయుల ఇబ్బందులకు గురవుతున్నారు. 

వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను నిశితంగా పరిశీలించడానికి వీలుగా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మే నెల దాకా వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల నుంచి ఈ–మెయిల్‌ సందేశాలు రావడం గమనార్హం. దాంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.

 ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్‌ జైస్వాల్‌ శుక్రవారం స్పందించారు. దరఖాస్తుదారుల కష్టాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా సంప్రదింపులు జరుపుతామని వివరించారు. వీసా దరఖాస్తుదారుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూల విషయంలో ఆలస్యాన్ని భారీగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందని రణ«దీర్‌ జైస్వాల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.  

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్‌–1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. మొదట మూడేళ్ల కాలానికి ఈ వీసా జారీ చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు. హెచ్‌–1బీ వీసాలు స్వీకరించినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.   
 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు