యాంటీ పేపర్ లీక్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం

Published on Fri, 07/31/2026 - 23:57

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటి పేపర్ లీక్‌ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ పాస్ అయిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో యాంటి పేపర్ లీక్ చట్టంగా మారింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

ఇటీవల దేశంలో ‘నీట్‌’ (NEET) వంటి ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో, విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.రూ. 10 కోట్ల వరకు జరిమానా: వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.

పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. 

ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్‌సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం  కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి.

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)