Breaking News

ఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడికి వెల్‌కమ్‌ బ్యానర్‌

Published on Sat, 06/08/2024 - 14:40

న్యూఢిల్లీ, సాక్షి: భారత దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్న వేళ.. హస్తినలో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు..  

పొరుగుదేశాల అధినేతకు సైతం ఢిల్లీ వర్గాలు ఆహ్వానం పంపాయి. ఈ క్రమంలో వాళ్లకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో మాల్దీవుల అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది.

కిందటి నవంబర్‌లో మాల్దీవ్స్‌ అధ్యక్షుడిగా మహమ్మద్‌ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక.. ఒకవైపు   భారత్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ, మరోవైపు చైనాతో సత్సంబంధాలు నడిపించేందుకు యత్నించారాయన. ఈ క్రమంలో భారత్‌తో ఆ దేశ సంబంధాలు క్షీణిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌ను విమర్శించడంతో పాటు బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలంటూ వ్యాఖ్యలు చేశారాయన.

ఇలాంటి పరిస్థితుల్లో.. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆ దేశ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది భారత్‌. అయితే ఆ ఆహ్వానానికి ముయిజ్జు అంతే సానుకూలంగా స్పందించారు. ఆహ్వానాన్ని స్వీకరించడంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానంటూ బదులిచ్చారు. అంతేకాదు.. తన పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సానుకూలంగా సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. అంతకు ముందు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మోదీ విజయంపై అభినందనలు తెలియజేశారు.

ఆదివారం సాయంత్రం జరగబోయే మోదీ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, మారిషస్‌.. దేశాల నేతలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)