Breaking News

‘గగన్‌యాన్‌’పై మున్ముందుకే..

Published on Thu, 02/12/2026 - 06:08

బెంగళూరు: మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’లో ఎన్ని అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే భారత్‌ మున్ముందుకే దూసుకెళ్లాలని గ్రూప్‌ కెప్టెన్, భారత వ్యోమగా మి, అశోక చక్ర అవార్డు గ్రహీత శుభాంశు శుక్లా అన్నారు. చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకోవాలని చెప్పారు. సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ ఉత్సాహంతో పనిచేస్తే అనుకున్నది సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లా డారు. మిషన్‌ గగన్‌యాన్‌ విజయవంతం అయి తే ఇలాంటి ఘనత సాధించిన దేశాల జాబితా లో భారత్‌  చేరుతుందని తెలిపారు.

 మనదేశ కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. గగనయాన్‌ యాత్ర ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇదే మనదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మూడు రోజుల్లో క్షేమంగా వెనక్కి తీసుకురావాలన్నది గగన్‌యాన్‌ లక్ష్యం. 2027లో ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. 

ఇప్పటికీ అదే ఉత్సాహం 
శుభాంశు శుక్లా ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) వెళ్లొచ్చారు. గగన్‌యాన్‌ కోసం శుక్లాతోపాటు మరో ము గ్గురు వ్యోమగాములను ఇస్రో ఎంపిక చేసింది. గగన్‌యాన్‌ సాధారణమైన మిషన్‌ కాదని శుక్లా పేర్కొన్నారు. ఇది అత్యంత సంక్లిష్ట మైన, సవాళ్లతో కూడుకున్న కార్యక్రమమని వివరించారు. అయినప్పటికీ అధైర్యపడే ప్ర సక్తే లేదన్నారు. మొదటి రోజు ఎంత ఉత్సా హంతో ఉన్నామో ఇప్పటికీ అదే ఉత్సాహంతో పని చేస్తున్నామని స్పష్టంచేశారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మళ్లీ భూమిపైకి తీసుకురావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.

 ఈ కార్యక్రమాన్ని ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నామని తెలిపారు. పెద్ద కార్యక్రమంలో కొన్ని అవరోధాలు, ఆలస్యా లు సహజమేనని వ్యాఖ్యానించారు. వాటిని ప్రతికూలతలుగా చూడొద్దని పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాల్లో వేర్వేరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని శుక్లా తెలిపారు.  ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయడంలో తప్పులేద న్నారు. 

తాను ఐఎస్‌ఎస్‌కు వెళ్లిరావడానికి అమెరికా కూడా సహకరించిందని గుర్తుచేశా రు. మన దేశంలో అంతరిక్ష కేంద్ర ప్రభుత్వం చక్కటి సహకారం అందిస్తోందని వివరించారు. సైన్స్, అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబ డులు నానాటికీ పెరుగుతుండడం శుభ పరిణామం అని చెప్పారు. గగన్‌యాన్‌ కోసం అందరూ ఓపిగ్గా ఎదురు చూడాలని యా త్రకు ఎంపికైన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఏది జరగాలో అది కచ్చితంగా జరుగుతుందన్నారు. గగన్‌యాన్‌ యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు కెక్కుతుందని స్పష్టంచేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)