Breaking News

తొలి హైడ్రోజన్‌ రైలు : దీని ప్రత్యేకతలివే!

Published on Fri, 07/17/2026 - 12:32

భారతీయ రైల్వే సరికొత్త మైలురాయిని తాకింది. పర్యావరణహితంగా, స్వదేశీసాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జెండా ఊపి ప్రారంభించారు. ఈ శూన్య ఉద్గారాల (Zero-emission) రైలుహర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలాంటి రైళ్లు కలిగిన అతికొద్ది దేశాల సమూహం లోకి భారతదేశం చేరింది. రైల్వే రంగంలో భారతదేశం స్వచ్ఛమైన సాంకేతికతను అవలంబించేలా చూడటంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రధాని మోదీ. 

దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు ప్రతిరూపంగా రీసెర్చ్, డిజైన్స్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్' (RDSO) ద్వారా ఈ రైలు పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. ఈ టెక్నాలజీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద, శక్తివంతమైన హైడ్రోజన్‌ పవర్‌ ప్యాసింజర్‌ రైలు. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుంది. 

ఇదీ చదవండి: హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు


 

 ;

 

గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపడానికి ఆమోదం పొందింది,  కానీ దీని డిజైన్‌ వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇందులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. ఇది 2600 ప్రయాణీకులనువారి వారి గమ్య స్థానాలకు చేరుస్తుంది.నిజానికి ప్రపంచంలో ఇప్పటికే నడుస్తున్న ఈ హైడ్రోజన్‌ ట్రైన్‌లకు కేవలం రెండు, నాలుగు కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అదీడా  అత్యంత తక్కువ దూరం  ప్రయాణిస్తాయి.

ఇది  జింద్ జంక్షన్, గోహానా జంక్షన్ ,సోనిపత్‌లను కలుపుతూ, జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఇసాపూర్ ఖేరి హాల్ట్, బుటానె హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రాబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మోహనా, బర్వాస్ని హాల్ట్ ,  సోనిపత్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది.పైలట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసినన ఈ రైలు, హైడ్రోజన్ టెక్నాలజీని పరీక్షించడంలో, భారతదేశంలో పర్యావరణ అనుకూల రైలు ప్రయాణం కోసం భవిష్యత్ ప్రణాళికలకు మద్దతు నిస్తుంది.

హైడ్రోజన్ ఆధారిత రైళ్లు ఉన్న ఇతర దేశాలు ఏవి?
హైడ్రోజన్ ఆధారిత రైలును  నడుపుతున్నదేశాల్లో అమెరికా  జర్మనీ, జపాన్, చైనా ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు అయిన ఆల్‌స్టామ్ కొరాడియా ఐలింట్‌ (Alstom Coradia iLint) ను ప్రవేశపెట్టడంలో జర్మనీ ముందంజలో ఉంది.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)