Breaking News

ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణం

Published on Tue, 10/22/2024 - 04:52

న్యూఢిల్లీ: అద్భుత ప్రగతి పథంలో దూసుకెళ్తూ ప్రపంచానికి భారత్‌ సరికొత్త ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఎన్‌డీటీవీ వరల్డ్‌ సదస్సులో ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేసి పలు అంశాలపై ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

డబుల్‌ ఏఐ ప్రయోజనాలు 
‘‘మూడోసారి అధికారంలోకి వచ్చి దేశాన్ని అద్భుతమైన ప్రతిపథంలో నడిపిస్తున్నాం. యుద్దాలు, సంక్షోభాలుసహా ప్రపంచాన్ని పలు సమస్యలు పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలకు భారత్‌ ఆశాకిరణంలా మారింది. రెండు ఏఐల అదనపు ప్రయోజనాలు భారత్‌సొంతం. ఒకటి ఆశావహ ఇండియా(ఏఐ), కాగా మరోకటి కృత్రిమమేథ(ఏఐ). ఈ రెండింటి కలయికతో భారత్‌ వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఆపత్కాలాల్లో ప్రపంచం భారత్‌ను ఒక స్నేహితునిలా చూస్తుంది. కోవిడ్‌ మహమ్మారివేళ ఎన్నో దేశాలకు భారత్‌ కరోనా వ్యాక్సిన్లను సరఫరాచేసింది. ఏ దేశంతోనూ భారత్‌ బంధం గాలివాటంగా ఏర్పడలేదు. 

ఎంతో నమ్మకం, సత్సంబంధాలతో బలోపేతమైంది. భారత్‌ బాగుపడితే అసూయపడే దేశాలు లేవు. ఎందుకంటే భారత దేశ అభివృద్ధి ఫలాలు ప్రపంచదేశాలకూ పనికొస్తాయని అందరికీ తెలుసు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతమైతే ప్రపంచమే సంబరాలు చేసుకుంది. చరిత్రలోకి తొంగిచూస్తే ప్రపంచఅభివృద్ధిలో భారతపాత్ర ఎనలేనిదని స్పష్టమవుతోంది. అయితే గత దశాబ్దాల్లో వలసపాలన కారణంగా ప్రపంచ పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను భారత్‌ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 యుగం మొదలైంది. అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటోంది’’ అని అన్నారు. 

డిజిటల్‌ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్యవిలువల్ని మేళవించాం 
‘‘ డిజిటల్‌ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువల్ని సమ్మిళితం చేశాం. అలాంటి సాంకేతికతే సాధికారత, పారదర్శకతలకు పనిముట్టుగా మారుతుంది. సాంకేతిక దన్నుతో ఎదిగిన యూపీఐ, పీఎం గతి శక్తి, ఓఎన్‌డీసీ వంటివి ఇందుకు మేలిమి తార్కాణాలు. ఇప్పుడు భారత్‌ అభివృద్ధి చెందడం మాత్రమేకాదు ఒక శక్తిగా అవతరిస్తోంది. పేదరికం వంటి సవాళ్లు ఉన్నాయని తెలుసు. త్వరితగతిన నూతన విధాననిర్ణయాలను అమలుచేస్తూ సంస్కరణలు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. 

ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారు 
‘‘మానవాళి చరిత్రలో 21 శతాబ్దపు ఈ కాలం ఎంతో ముఖ్యమైంది. సమస్యలను పరిష్కరించుకుంటూనే సుస్థిరాభివృద్ధిని సాధించాలి. మానవాళికి మెరుగైన భవిష్యత్తు అవసరం. అందుకోసం భారత్‌ పాటుపడుతోంది. దేశంలో గత ఆరుదశాబ్దాల్లో తొలిసారిగా వరుసగా మూడుసార్లు ఒకే ప్రభుత్వానికి ప్రజలుపట్టంకట్టారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారని హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ రుజువుచేశాయి. మూడోదఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేం రూ.9 లక్షల కోట్ల విలువైన మౌలికవసతుల ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ 125 రోజుల్లో స్టాక్‌మార్కెట్‌ సైతం ఆరేడు శాతం వృద్ధిని చూపిస్తోంది’’ అని మోదీ అన్నారు. మోదీ తర్వాత బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ సదస్సులో మాట్లాడారు. ‘‘ బ్రిటన్‌లో మార్గరేట్‌ థాచర్, టోనీ బ్లెయిర్‌  కాలం నుంచి చూసినా మా దేశంలో ఎవరూ మూడోసారి ప్రధాని కాలేదు. మీరు(మోదీ) మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు’’ అని కామెరూన్‌ పొగిడారు.   
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)