Breaking News

దేశానికి రక్షణగా.. శ్రీకృష్ణుడి స్పూర్తితో ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’

Published on Fri, 08/15/2025 - 14:06

న్యూఢిల్లీ, సాక్షి: మహాభారతంలో శ్రీకృష్ణుడి స్పూర్తితో ఎలాంటి ముప్పునుంచైనా దేశాన్ని రక్షించేందుకు వీలుగా మిషన్‌ సుదర్శన్‌ చక్రను అనే ఆధునిక ఆయుధ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 103 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో .. రాబోయే పదేళ్లలో అంటే  2035 నాటికి, దేశ భద్రత కోసం రక్షణా కవచాన్ని అందుబాటులోకి తేనున్నాం. అందుకే శ్రీకృష్ణుడి స్పూర్తితో సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థ 2035 నాటికి అభివృద్ధి అవుతుంది. మిషన్‌ సుదర్శన్‌ చక్ర దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ప్రార్ధనా స్థలాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలక ప్రదేశాలను సురక్షితంగా ఉంచేలా మిషన్‌ సుదర్శన చక్ర కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.   

ఈ మిషన్‌లో ఖచ్చితమైన లక్ష్య వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, ఇది శత్రువుల దాడిని అడ్డుకునేందుకు.. సుదర్శన్ చక్రం వలె శక్తివంతమైన ప్రతీకార దాడుల్ని తిప్పికొడుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా, గత పదేళ్లలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  భారత్‌ .. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి, డ్రోన్ దాడులను నిలువరించిన ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన ప్రస్తావించారు. 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)