Breaking News

పాక్‌ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్‌ జరిగేది ఇదేనా?

Published on Thu, 05/01/2025 - 09:22

ఢిల్లీ: పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్‌ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌ గగనం తలంలో పాక్‌ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్  ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్‌ విమానాల నిషేధం విధిస్తూ..  కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్‌ గగనం తలంపై పాక్‌ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్‌  రిజిస్టర్డ్‌ విమానాలు, అలాగే పాక్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. 

మరోవైపు భారత్‌ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్‌కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్‌ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్‌ విమానయాన రంగంపై పడనుంది.  విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్‌ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్‌ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది. 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు