Breaking News

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. జై శంకర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్‌

Published on Sat, 05/10/2025 - 12:48

ఢిల్లీ: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు యూఎస్‌ విదేశాంగ కార్యదర్శి రూబియా సూచించారు. జై శంకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. రెండు దేశాలు చర్చలు జరుపుకోవాలని కోరారు. పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలన్న రూబియో.. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామంటూ ప్రతిపాదించారు. భారత్‌ విధానం ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగానే ఉంటుందని జైశంకర్‌ అన్నారు.

అదే విధంగా.. కొన్ని గంటల ముందు.. పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు కూడా ఫోన్ చేసి రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రూబియో.. జైశంకర్‌తో మాట్లాడటం ఇది రెండోసారి. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో కూడా విడిగా మాట్లాడుతూ, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని చెప్పారు.

మరోవైపు, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము నిత్యం సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్, చైనా వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చెప్పారు. గురువారం సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అడెల్‌ అల్‌ జుబేర్‌ ఢిల్లీకి రావడం తెల్సిందే. అనంతరం శుక్రవారం ఆయన పాక్‌ చేరుకున్నారు. ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్‌ మునీర్‌తో చర్చలు జరపనున్న వేళ మంత్రి ఆసిఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)