Breaking News

Independence Day 2024: ఐదో వరుసలో రాహుల్‌

Published on Fri, 08/16/2024 - 05:01

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఆయనకు ఐదో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. రాహుల్‌ ముందు వరుసలో పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ క్రీడాకారులు కూర్చున్నారు. ఈ ఉదంతం ప్రధాని నరేంద్ర మోదీ అల్పబుద్ధికి నిదర్శనమంటూ కాంగ్రెస్‌ మండిపడింది.

 ‘‘లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన రాహుల్, మల్లికార్జున ఖర్గేలకు ప్రొటోకాల్‌ ప్రకారం తొలి వరుసలో సీటు కేటాయించాలి. కానీ వారిని ఐదో వరుసలో కూర్చోబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మోదీలో అహంకారం తగ్గలేదు’’ అంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ దుయ్యబట్టారు. ముందు వరుసలను ఒలింపిక్‌ విజేతలకు కేటాయించినందున రాహుల్‌ను వెనక వరుసకు మార్చామన్న రక్షణ శాఖ వివరణపై ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.

 ‘‘క్రీడాకారులకు గౌరవమివ్వాల్సిందే. కానీ అందుకోసం కొందరినే వెనక్కు జరిపారెందుకు? అమిత్‌ షా, జేపీ నడ్డా, ఎస్‌.జైశంకర్, నిర్మలా సీతారామన్‌ తదితర కేంద్ర మంత్రులను మొదటి వరుసలోనే ఎలా కూర్చోబెట్టారు?’’ అని ప్రశ్నించారు. దీనిపై సోషల్‌ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది. లోక్‌సభలో విపక్ష నేతకు కేబినెట్‌ హోదా ఉంటుంది. కేంద్ర మంత్రులతో పాటు ఆయనకు కూడా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో విపక్ష నేత పదవి పదేళ్లు ఖాళీగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)