పాక్‌ సైన్యం క్షమాపణ చెప్పాలి: మాజీ ‍ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

Published on Mon, 08/05/2024 - 13:47

ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి సైన్యంపై విమర్శల యుద్ధానికి దిగారు. కోర్టు నుంచి పలు  కేసుల్లో ఉపశమనం లభించడంతో ఇమ్రాన్‌లో నైతిక స్థైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఏడాది మే 9న అరెస్టయిన మాజీ ప్రధాని ఇమ్రాన్‌ నాడు చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అయితే హింసాకాండ జరిగిన రోజున పాక్ రేంజర్లు తనను కిడ్నాప్ చేసినందున ఆర్మీ తనకు క్షమాపణ చెప్పాలని ఖాన్‌ డిమాండ్‌ చేశారు.

ఇమ్రాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా పౌర, సైనిక సంస్థలకు నష్టం కలిగించింది. నాడు ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) అరాచక రాజకీయాలకు పాల్పడినందుకు క్షమాపణలు కోరితే చర్చలు జరపవచ్చని అన్నారు. ఈ ప్రకటన తరువాత బ్లాక్ డే హింసకు ఖాన్ పార్టీ క్షమాపణ చెప్పాలని వివిధ వర్గాల నుండి డిమాండ్లు వచ్చాయి.

డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మే 9న చెలరేగిన హింస విషయంలో క్షమాపణ చెప్పడానికి తన దగ్గర ఎటువంటి కారణం లేదని అన్నారు. నాడు ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్ నుండి మేజర్ జనరల్ నేతృత్వంలోని రేంజర్లు తనను అరెస్టు చేశారని ఖాన్‌ ఆరోపించారు. హింస జరిగిన రోజున తనను పాక్ రేంజర్లు కిడ్నాప్ చేశారని, అందుకు ప్రతిగా ఆర్మీ తనకు క్షమాపణలు చెప్పాలని ఖాన్ డిమాండ్‌ చేశారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)