Breaking News

భర్తను చంపిన వ్యక్తి విడుదల.. సుప్రీంకోర్టుకు ఐఏఎస్‌ అధికారి భార్య

Published on Sat, 04/29/2023 - 18:42

న్యూఢిల్లీ: 1994లో దారుణ హత్యకు గురైన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య సతీమణి ఉమ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను బిహార్ ప్రభుత్వం జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడాన్ని ఆమె సవాల్ చేశారు.  ఉరిశిక్షకు బదులు యావజ్జీక కారాగార శిక్ష పడిన వ్యక్తి జైల్లో ఉండాలని, కానీ బిహార్‌ ప్రభుత్వం నిబంధలనలు మార్చి విడుదల చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈమె ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను 1994లో బిహార్‌లో మూకదాడి చేసి దారుణంగా హత్య చేశారు. వీరికి ఆనంద్ మోహన్ నేతృత్వం వహించారు. ఈ కేసులో న్యాయస్థానం అతడ్ని దోషిగా తేల్చి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

అయితే బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు నిబంధలను మార్చింది.  విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన వారిని కూడా విడుదల చేసేలా సవరణలు చేసింది. దీంతో 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న మోహన్‌ జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈయన విడుదలను ప్రతిపక్షాలు సహా ఐఏఎస్ అధికారులు సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. బిహార్ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోలేదు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు శిక్ష

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)