Breaking News

రాజకీయాల కన్నా.. ఉద్యోగమే మిన్న

Published on Wed, 07/24/2024 - 12:04

సాక్షి, చెన్నై: రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే బెస్ట్‌ అన్నట్లుగా తనకు అనేక సందర్భాలలో ఆలోచనలు వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఒక్కోరోజు ఒక్కో సమస్య ఎదురు కావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంద్దామా? అనే భావన మదిలో మెదిలినట్లు పేర్కొన్నారు. ఐపీఎస్‌ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బీజేపీతో రాజకీయాల్లోకి అన్నామలై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఈ మూడేళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి ఆయన వీరోచితంగానే శ్రమించారు. అధికార పక్షాన్ని విమర్శలు, ఆరోపణలతో ఉతికి ఆరేయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని సైతం ఎండగట్టంలో ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కోయంబత్తూరులో తనకు ఓట్ల వేసిన వారికి, తనకోసం లోక్‌సభ ఎన్నికలలో శ్రమించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన సభలో అన్నామలై రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రోజుకో సమస్య.. 
తాన రాజకీయ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని పేర్కొంటూ మనస్సు విప్పి తన మదిలోని భావాలను పంచుకున్నారు. మూడేళ్లుగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష సీటులో కూర్చుని ఉన్నానని, ఇందులో కూర్చున్నప్పుడు పలు విషయాలను ఆలోచించే వాడినని వివరించారు. ఈ రాజకీయాలలో ఉండాలా? అవసరమా? అని ఆలోచించడమే కాకుండా, రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే సులభం అని భావించే వాడినని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో నలుపు, తెలుపు మాత్రమే ఉంటుందని, నేరం చేశాడా? చేయలేదా? అన్నది  కనిపెట్టేయవచ్చ అని అన్నారు.

 చివరకు రాజకీయాలలో కొనసాగేందుకు గాను పలు విషయాలలో రాజీ పడక తప్పలేదన్నారు. సాధరణ వ్యక్తిలా వెంటనే ఆగ్రహాన్ని ప్రదర్శించ లేనని, తప్పుగా చిత్రీకరిస్తే ఓపికగా నడచుకోక తప్పలేదని తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. రాజకీయాలో గెలుపు కోసం ఓపిక గా ఉండడం కన్నా, ప్రయత్నం చేయడం అవశ్యమన్నారు. ప్రజా పయనంలో అనేక సందర్భాలలో నిరుత్సాహం, నిరాశ ఎదురైనా, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనా, కత్తి పట్టి యుద్ధం చేయలేమని వ్యాఖ్యలు చేశారు. 

కొన్ని సందర్భాలలో వెనుకడుగు వేయక తప్పలేదని పేర్కొంటూ, ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా టాప్‌ గేర్‌లో దూసుకెళ్లాల్సిన అవశ్యం ఏర్పడిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోయంబత్తూరులో తాను ఓటమి పాలు కాలేదని, 4.5 లక్షల ఓట్లు చేజిక్కించుకోవడం సాధారణం కాదని, ప్రస్తుతానికి గెలుపు కూత వేటు దూరంలో ఆగి ఉందని, ఏదో ఒక రోజు వరించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)