Breaking News

సిద్ధరామయ్యకు ఆల్‌ ది బెస్ట్‌: డీకే శివకుమార్‌

Published on Mon, 05/15/2023 - 19:45

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌(61) పార్టీ హైకమాండ్‌కు  మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెబుతున్న ఆయన.. అవసరమైతే నిరసన తెలుపుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు.

తన నివాసంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. కాసేపటికే మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే. ఒంటరిగా కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా. పైగా కాంగ్రెస్‌ చీఫ్‌(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే.. వేరే వాళ్ల బలంపై నేను మాట్లాడను. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ పేర్కొన్నారాయన. 

ఇక ఢిల్లీకి తాను వెళ్లబోవట్లేదని తేల్చి చెప్పిన శివకుమార్‌.. పనిలో పనిగా చివరిలో సిద్ధరామయ్యకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ కామెంట్‌ చేశారు. అంతేకాదు.. తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను. నేనేం బచ్చాగాడ్ని కాదు. నాకంటూ ఓ విజన్‌ నాకుంది. అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది. ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. 

ఇదిలా ఉంటే.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు  తనకు ఉందంటూ హస్తిన పర్యటనకు వెళ్లిన సిద్ధరామయ్య(75), ఇవాళ రాత్రి పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీతో భేటీ అవుతారనే ప్రచారం నడుస్తోంది.

ఇదీ చదవండి: డీకే శివకుమార్‌తో నాకు మంచి దోస్తీ ఉంది!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)