Breaking News

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు వెల్లడి

Published on Thu, 10/26/2023 - 20:27

సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్‌ఐఏ(National Investigation Agency) న్యాయస్థానం. 

ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్‌ ఉర్‌ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. పాక్‌ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు ఒబెద్‌ కుట్ర పన్నాడు.  అయితే..  తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్‌ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది.

ఇక ‘ముజాహిద్దీన్‌ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్‌ ముక్బుల్‌ను సెప్టెంబర్‌ 22వ తేదీన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్‌. నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్‌ చేశారు. పాక్‌ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో ముక్బుల్‌ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది కూడా.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)