Breaking News

కోర్టులో భర్త చేసిన పనికి బిత్తర పోయిన భార్య.. అసలేం జరిగిందంటే?

Published on Thu, 04/20/2023 - 08:54

సేలం(తమిళనాడు): అభిప్రాయబేధాల కారణంగా విడిపోయిన భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర నాణేలుగా భర్త తీసుకువచ్చిన సంఘటన తమిళనాడులోని సేలం కోర్టులో జరిగింది. సేలం జిల్లా దేవన్నక వుండనూరు కిడయూరు మెట్టూరుకి చెందిన రాజీ (57) ఓ ప్రైవేట్‌ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శాంతి. వీరు అభిప్రాయభేదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు.

ఈ పరిస్థితిలో భరణం కోసం శాంతి సంగగిరి 2వ క్రిమినల్‌ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి.. శాంతికి ప్రతి నెలా రూ.73,000 జీవన భృతిగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఆ మొత్తాన్ని రాజీ సరిగ్గా చెల్లించకపోవడంతో శాంతి సంగగిరి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. బకాయి మొత్తాన్ని (రూ.2.18 లక్షలు) వెంటనే చెల్లించాలని రాజీని ఆదేశించారు.
చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..

దీంతో బుధవారం ఉదయం రాజీ తన భార్యకు చెల్లించాల్సిన భరణం సొమ్ము రూ.2.18 లక్షలను రూ.10 నాణేలుగా 11 బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చాడు. దీంతో కోర్టు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా, భార్యకు భరణం సొమ్మును చిల్లర రూపంలో ఇచ్చి ఆమెను భర్త అవమానించాడని కోర్టు సిబ్బంది మండిపడ్డారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)