ఆడవాళ్లున్నారుగా ఆగు అన్నందుకే చంపేశాడు!

Published on Thu, 01/29/2026 - 13:11

క్షణికావేశంతో  తోటి ప్రయాణికుడు, కాలేజీ  ప్రొఫెసర్‌ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కదులుతున్న లోకల్ రైలు నుండి దిగుతున్నప్పుడు  స్వల్ప వివాదం చోటు  చేసుకుంది.  ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చేసుకుంది.

 మలాడ్ రైల్వే స్టేషన్‌లో దిగేందుకు ప్రయాణికులు సిద్దమవుతున్నారు. ఫుట్‌బోర్డు దగ్గర ఇద్దరు మహిళలు నిలబడి ఉన్నారు. ఇంతలో వారిని తోసుకుంటూ ముందుకు  రావడానికి ప్రయత్నించాడు.  27 ఏళ్ల షిండే. దీంతో ముందు మహిళలు ఉన్నారు కదా.. కనపించడం లేదా అని మందలించాడు  వారి వెనుక ప్రొఫెసర్ అలోక్ కుమార్ సింగ్‌. చాలా సాధారణంగా చెప్పిన ఆ మాటలే తన పాలిట మరణ దండనగా మారిపోతాయని ఆయన అస్సలు ఊహించి ఉండడు. కోపోద్రిక్తుడైన షిండే  స్టేషన్‌లో దిగగానే ఫ్లాట్‌ఫామ్‌మీదే సింగ్‌ను  అతి దారుణంగా పొడిచాడు. దీంతో సింగ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఇది చూసి  నిందితుడు షిండే  అక్కడినుంచి పారిపోయాడు.  సింగ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఈయన విలే పార్లేలోని ఒక ప్రముఖ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత వారం ఈ సంఘటన జరిగింది.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా  షిండేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా సింగ్ తనను నెట్టి, అవమానించాడని, ఆ మహిళలు వెనక్కి తిరిగి తన వైపు చూశారు. దీంతో అవమానానికి గురయ్యానని పోలీసులకు చెప్పాడు. అందుకే అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నానని, ఆయన చనిపోయిన విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించాడు. షిండేకు జనవరి 29 వరకు పోలీసు కస్టడీ విధించారు. 

పోలీసు వర్గాల ప్రకారం, షిండే తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి మలాడ్‌లో నివసిస్తున్నాడు. తల్లి గృహిణి, తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అతని సోదరుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిందితుడు గ్రాంట్ రోడ్‌లో చిన్న నకిలీ ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు. తన కొడుకుకు కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇబ్బంది ఉందని షిండే తండ్రి పోలీసులకు తెలిపారు.

ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్‌ ప్రపోజల్‌..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!


 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)