Breaking News

మాతృ వందన యోజనకు నిధులేవీ?

Published on Thu, 03/27/2025 - 06:05

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై)కు నిధులు ఇవ్వడం లేదని రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విమర్శించారు. గర్భిణుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఆమె బుధవారం రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. గర్భిణులకు ప్రయోజన కరమైన పథకానికి నిధులు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

లబ్ధిదారుల సంఖ్య నానాటికీ పడిపోతోందని గుర్తుచేశారు. 2022–23లో 68 శాతం మంది గర్భిణులు కనీసం ఒక దఫా ప్రయోజనాలు అందుకున్నారని, 2023–24లో ఇది 12 శాతానికి పడిపోయిందన్నారు. ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పీఎంఎంవీవైని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ప్రతిఏటా కనీసం రూ.12,000 కోట్లు అవసరమని సోనియా గాంధీ వివరించారు. 2025–26 బడ్జెట్‌లో మాత్రం అరకొర నిధులే కేటాయించారని విమర్శించారు.
 
అమిత్‌ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: రాజ్యసభలో సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌ బుధవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు–2024పై చర్చ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోకేవలం ఒక్క కుటుంబమే అధికారం చెలాయించిందని, అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు(సోనియా గాంధీ) కూడా ఆ కుటుంబంలో ఉన్నారని చెప్పారు. దీనిపై జైరామ్‌ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్‌ షాపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరుతూ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు నోటీసు అందశేశారు.     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)