Breaking News

ఆ సీటులో ఉంటే భద్రమేనా?

Published on Fri, 06/13/2025 - 12:23

అహ్మ‌దాబాద్‌లో గురువారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్ర‌మాదం నుంచి ర‌మేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్‌ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ విమానంలో ఈ సీటు ఎకానమీ క్లాస్‌ కేబిన్‌లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే రెండు వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోరు వెనుకే 11ఏ సీటు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేశ్‌ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. 11ఏ సీటు (Seat 11A) సురక్షితమని భావిస్తున్నారు.

హాట్‌లైన్‌ నెంబర్‌
మరోవైపు విమాన ప్రమాదంతోపాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్‌ ఇండియా సంస్థ 1800 5691 444 హాట్‌లైన్‌ నెంబర్‌ ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం +91 8062779200 నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

విమానం కొత్తదే! 
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గురువారం కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787 విమానం మరీ పాతదేమీ కాదని ఏవియేషన్‌ అధికారులు తెలిపారు. ఈ విమానం 2013లో సేవలు ప్రారంభించిందని వెల్లడించారు. 12 సంవత్సరాల నుంచి ఇది వాణిజ్య సేవలు అందిస్తోంది. పౌర విమానయాన రంగంలో 12 సంవత్సరాలు అంటే దాదాపు కొత్త విమానం కిందే లెక్క అని నిపుణులు తెలిపారు. 

ఈ విమానం వీటీ–ఏఎన్‌బీ పేరుతో రిజిస్టర్‌ అయ్యింది. ఎయిర్‌ ఇండియా సంస్థ వద్ద ఉన్న బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ రకానికి చెందిన 27 విమానాల్లో ఇదీ ఒకటి. ఈ రకానికి చెందిన ఒక విమానం ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం కావటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 2020లో కాసరగోడ్‌లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కూలిపోయిన ఘటన తర్వాత దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే.

చ‌ద‌వండి: నాన్నకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోకుండానే.. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)